మెగా అల్లుడు వచ్చేశాడు..!

మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి చిన్నళ్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. రాకేష్ శషి డైరక్షన్ లో విజేత సినిమాతో కళ్యాణ్ దేవ్ వస్తున్నాడు. ఈ సినిమాను వారాహి చలన చిత్రం బ్యానర్ లో ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన కళ్యాణ్ దేవ్ ఈరోజు సినిమా టీజర్ తో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. 

తండ్రి కొడుకుల సెంటిమెంట్ కథతో ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రాబోతుంది విజేత. ఈ సినిమాకు సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా టీజర్ అయితే ఇంప్రెస్ చేసింది. మెగా సపోర్ట్ తో వస్తున్న కళ్యాణ్ దేవ్ హీరోగా నిలబడతాడనే అనిపిస్తుంది. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జూలైలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.