
నాచురల్ స్టార్ నానిపై శ్రీరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా అంతా హాట్ హాట్ గా చెక్కర్లు కొడుతున్నాయి. నానితో తనకు ఎఫైర్ ఉందని చెప్పుకుంటూ నాని మీద రకరకాల కామెంట్స్ చేస్తున్న శ్రీరెడ్డికి ఈసారి నాని నుండి సరైన రెస్పాన్స్ వచ్చింది. ఓపికకు ఓ హద్ధు ఉంటుందని ట్వీట్ చేస్తూ తన మీద నిరాధారమైన కామెంట్స్ చేస్తున్నందుకు వారి మీద లీగల్ యాక్షన్ కు దిగుతున్నా అని ప్రకటించాడు నాని.
అలాంటి కామెంట్స్ వల్ల తనకు ఎలాంటి బాధ లేదని కాని ఇది అందరి సమస్య అంటూ చెప్పుకొచ్చాడు నాని. కాస్టింగ్ కౌచ్ మీద శ్రీరెడ్డి చేసిన హంగామా వల్ల మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఓ స్పెషల్ టీం ఏర్పాటుచేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి వేరే రూట్ లోకి వెళ్లింది. ఈమధ్య నాని మీద విపరీతమైన కీమెంట్లు, ట్వీట్లు చేస్తూ వచ్చిన శ్రీరెడ్డి ఫైనల్ గా నాని ఇచ్చిన షాక్ కు అవాక్కయ్యే ఉంటుంది. మరి నాని లీగల్ నోటీసులు పంపిస్తే శ్రీరెడ్డి దానికి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.