
2013లో వచ్చిన విశ్వరూపం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకు సీక్వల్ గా విశ్వరూపం-2 2015లోనే మొదలు పెట్టాడు కమల్ హాసన్. మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చినా ఆ సినిమాను ఇప్పుడు రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు కమల్ హాసన్. కమల్ హాసన్ దర్శక నిర్మాతగా వ్యవహరించిన విశ్వరూపం-2 ట్రైలర్ కొద్ది గంటల క్రితం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది.
తెలుగు, తమిళ, హింది బాషల్లో రిలీజ్ అవనున్న ఈ సినిమా ట్రైలర్ కూడా మూడు బాషల్లో రిలీజ్ చేశారు. టెర్రరిజం నేపథ్యంతో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉంది. విశ్వరూపం సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఆగష్టు 10న రిలీజ్ అవబోతున్న ఈ సినిమాతో కమల్ మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నారు.