
నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం జెంటిల్‌మేన్, సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో, ప్రస్తుతం ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇంతటి ఘనవిజయం సాధించడంతో నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెడుతుంది. ఇక జెంటిల్‌మన్ రీమేక్ రైట్స్ కోసం భారీ మొత్తం చెల్లించేందుకు రెడీ అయ్యారట తమిళ, కన్నడ ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూటర్స్. ఒక చిన్న సినిమాకోసం ఇలా పోటీపడటంతో నిర్మాతలు ఈ సినిమా హక్కులను ఫ్యాన్సీ రేటుకు అమ్మడానికి రెడీ అవుతున్నారట.
ఇప్పటికే సినిమా కలెక్షన్స్, శాటిలైట్ రైట్స్ రూపంలో సేఫ్ జోన్‌లోకి వచ్చిన నిర్మాతలకు రీమేక్ రైట్స్ రూపంలో వచ్చే మొత్తం లాభం అనే చెప్పాలి. ఎంత రేటుకు అమ్ముతారో తెలియని ఈ రీమేక్ రైట్స్‌తో, నాని ఖాతాలో మరో హిట్ సినిమా రీమేక్ రైట్స్ రూపంలో లాభాలను తెచ్చిపెట్టడంతో నాని తరువాత సినిమాలపై కూడా ఇప్పట్నుంచే కన్నేశారట నిర్మాతలు. నాని జెంటిల్‌మన్ సినిమాలో చూపించిన నటన, ముఖ్యంగా మళయాల బ్యూటీ నివేదా థామస్ యాక్టింగ్, స్క్రీన్‌ప్లే.. ఇలా అన్నీ అద్భుతంగా ఉండటంతో ఈ సినిమా కోసం బయ్యర్లు తెగ పోటీపడుతున్నారు.