మహేష్ లుక్ అదిరిపోయింది..!

సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సూపర్ హిట్ తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నాడు. మహేష్ 25వ సినిమాగా చాలా ప్రెస్టిజియస్ గా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది. దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ రఫ్ లుక్ లో కనిపిస్తారని తెలుస్తుంది. ఈమధ్యనే ఎయిర్ పోర్ట్ లో మహేష్ గడ్డం లుక్ లీక్ అయ్యింది. అయితే సుధీర్ బాబు హీరోగా వస్తున్న సమ్మోహనం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మహేష్ అటెండ్ అయ్యారు.

గడ్డం లుక్ తో సూపర్ స్టార్ మహేష్ సర్ ప్రైజ్ ఇచ్చారు. పోకిరిలో మాస్ లుక్ లో కనిపించినా గడ్డం అంతగా పెంచుకోలేదు. కాని ఈసారి వంశీ సినిమాకు మాత్రం కంప్లీట్ మేకోవర్ చూపించబోతున్నాడు. ఫ్యాక్షన్ కథతో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. వారంలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా 2019 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.