ప్రభాస్ తో ఆ క్రేజీ డైరక్టర్..!

మహానటి సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్న నాగ్ అశ్విన్ తన తర్వాత సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేయనున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. బాహుబలితో నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ డైరక్షన్ లో సాహో సినిమా చేస్తున్నాడు. 150 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కూడా యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారని తెలుస్తుంది. ఈ రెండు ముగించుకున్నాక నాగ్ అశ్విన్ డైరక్షన్ లో ప్రభాస్ సినిమా ఉంటుందట. ఈమధ్యనే నాగ్ అశ్విన్ ప్రభాస్ ను కలిసి ఓ లైన్ వినిపించాడట. అది నచ్చడంతో ప్రభాస్ అశ్విన్ కు ఓకే చెప్పాడని టాక్. మొత్తానికి అశ్వనిదత్ తన అల్లుడు కోసం క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేస్తున్నాడని తెలుస్తుంది.