విశ్వరూపం-2 కోసం ఎన్టీఆర్..!

యూనివర్సల్ స్టార్.. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తానే దర్శక నిర్మాతగా వ్యవరించి తీసిన సినిమా విశ్వరూపం. 2013 లో వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. సినిమా రిలీజ్ కు ముందు రిలీజ్ తర్వాత ఎన్నో వివాదాలయ్యాయి. ఇక ఇప్పుడు ఆ సినిమాకు పార్ట్-2 రెడీ అయ్యింది. 2015లో మొదలుపెట్టిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఫైనల్ గా విశ్వరూపం-2 రిలీజ్ కు రెడీ అవుతుంది. 

తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ సినిమా రాబోతుంది. తెలుగు ట్రైలర్ ను ఎన్.టి.ఆర్, తమిళ ట్రైలర్ శృతి హాసన్, హింది ట్రైలర్ ను ఆమీర్ ఖాన్ రిలీజ్ చేస్తున్నారు. జూన్ 11న సాయంత్రం 5 గంటలకు విశ్వరూపం-2 ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఎన్.టి.ఆర్ రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి సినిమా తెలుగులో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుంది. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమాపై కమల్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు.