
నారా రోహిత్ హీరోగా పరుచూరి మురళి డైరక్షన్ లో సైలెంట్ గా వస్తున్న సినిమా ఆటగాళ్లు. జగపతి బాబు ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. సినిమాలో నారా రోహిత్ ఓ హీరోగా నటిస్తున్నాడు. తన భార్య మర్డర్ మిస్టరీలో తనని పోలీసులు ఇంటరాగేట్ చేస్తారు. జగపతి బాబు క్రిమినల్ లాయర్ గా కనిపిస్తున్నాడు.
ఆంధ్రుడు సినిమాతో ఆడియెన్స్ ను అలరించిన పరుచూరి మురళి ఈసారి సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చినట్టు తెలుస్తుంది. నారా రోహిత్, జగపతి బాబు పాత్రలు నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నాయి. టీజర్ తో ఇంప్రెస్ చేసిన ఈ ఆటగాళ్లు ఎలా ఆడియెన్స్ ను అలరిస్తారో చూడాలి. నారా రోహిత్ లుక్స్, జగపతి బాబు స్టైల్ ఈ సినిమాకు ప్లస్ అయ్యే అంశాలు. నమిత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.