ఈసారి సంక్రాంతికే మహేష్..!

భరత్ అనే నేను సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ తన 25వ సినిమా వంశీ పైడిపల్లితో చేస్తున్నాడు. దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుందట. వంశీ పైడిపల్లి ఈ సినిమా కథను అద్భుతంగా నేరేట్ చేశాడని టాక్. సినిమాలో మహేష్ తో పాటుగా అల్లరి నరేష్ కూడా నటిస్తున్నాడు.

పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా 2019 సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నారు. 2019 సంక్రాంతికి ప్రభాస్ సాహో, రాం చరణ్ బోయపాటి సినిమాలు సిద్ధమవుతున్నాయి. మరి ఈసారి పొంగల్ వార్ కూడా బీభత్సంగా సాగుతుందని చెప్పొచ్చు.