ట్రైలర్ తో షాక్ ఇచ్చిన మంచు లక్ష్మి..!

మంచు ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి తన మార్క్ సినిమాలను చేస్తూ వచ్చింది. ప్రస్తుతం ఆమె లీడ్ రోల్ లో వస్తున్న సినిమా వైఫ్ ఆఫ్ రామ్. సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. ఓ మర్డర్ మిస్టరీ చుట్టూ ఈ సినిమా నడుస్తుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. తన భర్తని చంపిన వారిని మంచు లక్ష్మి ఎలా పట్టుకుంది అన్నదే సినిమా కథ. 

విజయ్ యేలకంటి డైరక్షన్ లో వస్తున్న సినిమా వైఫ్ ఆఫ్ రామ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తో కలిసి మంచు లక్ష్మి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆమెతో పాటుగా ఆదర్శ్, సామ్రాట్ రెడ్డి నటిస్తున్నారు. సినిమా ట్రైలర్ అయితే ఇంప్రెసివ్ గా ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. సరైన స్క్రీన్ ప్లేతో వస్తే ఆ సినిమాలు తప్పకుండా హిట్ సాధిస్తాయి. మరి మంచు లక్ష్మి చేస్తున్న ఈ వైఫ్ ఆఫ్ రాం ఆమెకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.