ఆ నలుగురు తర్వాత ఆటకదరా శివ

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్ లో ఆ నలుగురు సినిమా తీసిన దర్శకుడు చంద్ర సిద్ధార్థ్. ఆ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత అదే తరహాలో కొన్ని సినిమాలు చేసినా చంద్ర సిద్ధార్థ్ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. మంచి సినిమాలను తీయడంలో ముందుండే చంద్ర సిద్ధార్థ్ ఈసారి మళ్లీ అలాంటి డిఫరెంట్ కథతో ఆటకదరా శివ సినిమాతో వస్తున్నాడు. 

ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. హ్యాంగ్ మ్యాన్ జీవిత ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారట. సినిమాలో జబర్దస్త్ కమెడియన్స్ ను బాగా వాడినట్టు తెలుస్తుంది. ట్రైలర్ ఇంప్రెసివ్ గా అనిపించగా ఈ సినిమాతో మరోసారి చంద్ర్ సిద్ధార్థ్ తన సత్తా చాటుతాడని అంటున్నారు. ఈమధ్య తెలుగు ఆడియెన్స్ బడ్జెట్ తో సంబంధం లేకుండా చిన్న సినిమా అయినా మంచి కథతో వస్తే దాన్ని ఆదరిస్తున్నారు. మరి చంద్ర సిద్ధార్థ్ ఆటకదరా శివ కూడా అలానే మంచి ఫలితాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.