
కోలీవుడ్ లో స్టార్ ఇమేజ్ సంపాదించిన శింభు తన ప్రవర్తన కారణంగా ఆ ఇమేజ్ కు దూరమయ్యాడు. కెరియర్ లో చాలా వెనుకపడ్డ ఈ హీరో సినిమాల్లో కన్నా వివాదాల్లో ఎక్కువగా ఉంటాడు. ఇక ప్రస్తుతం కెరియర్ ను గాడిలో పడేసే క్రమంలో ఒకేరోజు మూడు సినిమాలను ఎనౌన్స్ చేశాడు శింభు. దీనిపై కోలీవుడ్ ఆడియెన్స్ విమర్శలు చేషారు. ముందు టైం కు షూటింగ్ కు వెళ్లూ.. దర్శక నిర్మాతల మాట విను అంటూ కామెంట్స్ పెట్టారు. వాటికి స్పందిస్తూ తన పొగరు చూపించాడు శింభు.
తనకు 1000 కోట్ల ఆస్తి ఉందని.. సినిమాలంటే ఇష్టం ఉన్న కారణంగా ఇలా చేస్తున్నానని అన్నారు. అవసరం లేదనుకుంటే వదిలేస్తానని ఏకంగా ఓ ప్రెస్ నోట్ నే రిలీజ్ చేశారు శింభు. తను 10 గంటలకే షూటింగ్ స్పాట్ కు వెళ్తానని.. ఇక నుండి తన వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా ఉండేలా జాగ్రత్త పడతానని చెప్పారు శింభు. నిరంతరం వార్తల్లో ఉండే శింభు ఇక నుండి సినిమాల మీద పూర్తి దృష్టి పెట్టబోతున్నాడట. తన సొంత డైరక్షన్ లో ఒక సినిమా చేస్తున్న శింభు, గౌతం మీనన్ డైరక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు.