
రీసెంట్ గా తమిళనాడులో జరిగిన తూత్తుకూడి ఘటన గురించి తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటనలో పోలీసుల కాల్పులలో పెద్ద ఎత్తునే ప్రాణాలు కోల్పోయారు. పర్యావరణం, ఆరోగ్యం సమస్యల కారణంగా జరిగిన ఈ అల్లర్ల వల్ల తమిళనాడు పేరు దేశ వ్యాప్తంగా వినపడింది. ఇక ఈ ఇన్సిడెంట్ గురించి పొలిటికల్, సిని జనాలు మాట్లాడారు.
తూత్తుకుడి వెళ్లిన రజినికాంత్ అక్కడ వారు చేసిన పనికి షాకి అయ్యాడు. ఇక ఇప్పుడు మరో హీరో విజయ్ ఎవరికి తెలియకుండా తూత్తుకుడి వెళ్లారు. అక్కడ పోలీసుల కాల్పుల్లో మరణించిన బాధిత కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చి వచ్చారట. తాను వస్తున్న విషయం ఎక్కడ మీడియాకు లీక్ కానివ్వలేదు. విజయ్ బైక్ మీదే వచ్చి వెళ్ళారని తెలుస్తుంది. తాను చేసే మంచి పనికి పబ్లిసిటీ అవసరం లేదు అనుకునే రీల్ అండ్ రియల్ హీరో విజయ్ అని అందరు అంటున్నారు.