మెగా హీరోకి అతిథిగా చిరు..!

మెగా ఫ్యామిలీలో ఏ హీరో సినిమా అయినా మెగాస్టార్ ప్రమోషన్ ఉండాల్సిందే. కుదిరితే చిరు లేదంటే పవన్ అన్నట్టుగా మెగా హీరోల సినిమాలు ప్రమోట్ చేస్తుంటారు. లేటెస్ట్ గా మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కరుణాకరణ్ డైరక్షన్ లో వస్తున్న సినిమాకు మెగా సపోర్ట్ ఇస్తున్నారు. కె.ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమాకు తేజ్ ఐలవ్యూ అని టైటిల్ పెట్టారు.  

జూన్ 29న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ఆడియో వేడుకకు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రానున్నాడట. జూన్ 9న జె.ఆర్.సి కన్వెన్షన్ లో తేజ్ ఐలవ్యూ ఆడియో రిలీజ్ కానుంది. చిన్నదానా నీకోసం సినిమా తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో కరుణాకరణ్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. మెగాస్టార్ ప్రమోషన్స్ తో ఈ సినిమా మరో రేంజ్ కు వెళ్తుండగా వరుస ఫ్లాపులు కెరియర్ సంక్షోభంలో పడేయగా సాయి ధరం తేజ్ ఈసారి హిట్ కొట్టేయడం పక్కా అంటున్నారు.