
భరత్ అనే నేను తర్వాత మహేష్ చేస్తున్న సినిమా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మహేష్ కొత్త లుక్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. కంటెంట్ పరంగా కొత్తగా ట్రై చేస్తున్న మహేష్ లుక్ విషయంలో రెగ్యులర్ గా కనిపిస్తున్నాడు.
ఇక వంశీ పైడిపల్లి సినిమాకు గడ్డంతో మాస్ లుక్ లో కనిపిస్తాడట మహేష్. రీసెంట్ గా ఈ లుక్ లీక్ అయ్యింది. ఎయిర్ పొర్ట్ లో మహేష్ వస్తుండగా కెమెరాలు క్లిక్ అనిపించారు. క్యాప్ పెట్టుకుని గడ్డంతో మహేష్ సర్ ప్రైజ్ చేశాడు. అయితే అఫిషియల్ లుక్ మాత్రం ఇప్పుడప్పుడే వచ్చేలా లేదు. రాజసం, రైతుబిడ్డ టైటిల్స్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడట.