కేటీఆర్ కు ఛాలెంజ్..!

ప్రస్తుతం సిని, క్రీడా, పొలిటికల్ ప్రముఖులు అందరు స్వీకరిస్తూ ఛాలెంజ్ విసురుతున్న ప్రోగ్రామ్ హమ్ ఫిట్ తో ఇండియా. కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ మొదలు పెట్టిన ఈ ఛాలెంజ్ కొహ్లి, సింధు, సైనా నెహ్వాల్ నుండి టాలీవుడ్ సెలబ్రిటీస్ దగ్గరకు వచ్చింది. రీసెంట్ గా అఖిల్ నాగార్జునకు ఛాలెంజ్ విసరగా నాగార్జున వర్క్ అవుట్స్ చేసి చూపించాడు. అదేవిధంగా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తను వర్క్ అవుట్స్ చేసి ఎన్.టి.ఆర్, సూర్య, పృధ్విలకు ఛాలెంజ్ చేశాడు. 

ఇక ఎన్.టి.ఆర్ కూడా ఈ ఛాలెంజ్ ప్రకారం వర్క్ అవుట్స్ చేసి రాం చరణ్, మహేష్, కళ్యాణ్ రామ్ లకు ఛాలెంజ్ విసిరాడు. అయితే తారక్ చేసిన ఛాలెంజ్ ను రిసీవ్ చేసుకున్న చరణ్ బాక్సింగ్ వర్క్ అవుట్స్ చేస్తూ వీడియో పెట్టాడు. ఇక తాను కూడా ఈ ఛాలెంజ్ లో తెలంగాణా మంత్రి కేటీఆర్, సుకుమార్, వరుణ్ తేజ్, అబు జాని, సందీప్ కోస్లా, శోభన కామినేనిలను భాగం చేశాడు.