
గరుడవేగ సినిమాతో యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్ కెరియర్ గాడిలో పడేలా చేసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు తన తర్వాత సినిమాగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో తీయాలని అనుకున్నారు. బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే క్యాన్సిల్ అయ్యింది. ప్రవీణ్ అడిగిన బడ్జెట్ ఇవ్వడం కుదరదని చెప్పేసరికి ప్రవీణ్ సత్తారు ఆ ప్రాజెక్ట్ ను ఆపేశాడు.
ఇక ఈ సినిమాను కోలీవుడ్ లో తీయాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడట ప్రవీణ్ సత్తారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ఈ సినిమా తీయాలని చూస్తున్నాడట ప్రవీణ్ సత్తారు. ధనుష్ సినిమా అపాయింట్మెంట్ కోసం ప్రవీణ్ వెయిట్ చేస్తున్నాడట. తమిళంతో పాటుగా తెలుగులో ధనుష్ కు ఓ మోస్తారు మార్కెట్ ఉంది. బడ్జెట్ కలిసి వచ్చేలా రెండు భాషల్లో సినిమా తీస్తే బెటర్ అని ప్రవీణ్ సత్తారు రామ్ తో తీయాలనుకున్న సినిమాను ధనుష్ తో తీయాలని ఫిక్స్ అయ్యాడట.