వరుణ్ తేజ్.. అంతరిక్షం..!

మెగా హీరోల్లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్న వరుణ్ తేజ్ సినిమా సినిమాకు డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఫిదా, తొలిప్రేమ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న వరుణ్ తేజ్ ఈసారి స్పేస్ థ్రిల్లర్ తో వస్తున్నాడు. ఘాజి డైరక్టర్ సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు టైటిల్ గా అంతరిక్షం అని పెట్టబోతున్నారట.

స్పేస్ కథ కాబట్టి ఆ టైటిల్ యాప్ట్ అవుతుందని అదే డిసైడ్ చేశారట. వరుణ్ తేజ్ కెరియర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. రానా హీరోగా వచ్చిన ఘాజితో సత్తా చాటిన సంకల్ప్ రెడ్డి ఈసారి మరింత క్రియేటివిటీగా ఈ సినిమా తీస్తున్నారట. హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమా వస్తుందని అంటున్నారు. ఈ సినిమాతో పాటుగా వరుణ్ తేజ్ విక్టరీ వెంకటేష్ తో ఎఫ్-2 సినిమాలో నటిస్తున్నాడు.