
కబాలి తర్వాత కాలాగా వస్తున్నాడు రజినికాంత్. పా. రంజిత్ డైరక్షన్లో ధనుష్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో జూన్ 7న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రీసెంట్ గా జరిగింది. రజినికాంత్ తో పాటుగా చిత్ర దర్శకుడు, నిర్మాత తెలుగు ప్రొడ్యూసర్స్ తిరుపతి ప్రసాద్, దిల్ రాజు ఈ సినిమాలో పాల్గొన్నారు.
ఇక ఈ వేడుకలో భాగంగా ధనుష్ ఒక్కడే రజినికాంత్ ఎలాంటి సినిమా అయినా చేస్తాడు అన్న కామెంట్ కు రజిని స్పందించాడు. తెలుగులో మాట్లాడిన రజినికాంత్ ముందు ఎన్.టి.ఆర్, దాసరిల గురించి ప్రస్థావించాడు. ఇక ధనుష్ చెప్పినట్టుగా ఒక్కడే రజినికాంత్ మాత్రమే కాదు ఒక్కడే చిరంజీవి, ఒక్కడే నాగార్జున, ఒక్కడే బాలకృష్ణ, ఒక్కడే వెంకటేష్ అని అన్నారు.
అవకాశం అన్నది లక్ అని కొందరు అనుకుంటే.. దేవుని ఆశీర్వాదం అని కొందరు అంటారు. తమిళ ప్రేక్షకుల్లా తెలుగు ఆడియెన్స్ కూడా తనని ఆదరిస్తారని. తన సినిమాలు భాషా నుండి రోబో వరకు ఇక్కడ మంచి హిట్లు అయ్యాయని అన్నారు రజినికాంత్. అవకాశానికి తగినట్టుగా కష్టపడితే ఎవరైనా మంచి స్థానానికి వెళ్తారని అన్నారు రజిని.