దర్శకులంతా ఒకేచోట..!

ప్రస్తుతం టాలీవుడ్ లో సక్సెస్ ఫాం కొనసాగిస్తున్న దర్శకులంతా ఒక చోట చేరితే. అబ్బో ఈ ఆలోచన ఏదో బాగుంది కదా ఇలాంటి ఆలోచనే ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లికి వచ్చింది. రాజమౌళి, సుకుమార్, నాగ్ అశ్విన్, క్రిష్, సందీప్ వంగ, కొరటాల శివ, అనీల్ రావిపుడి, వంశీ పైడిపల్లి ఇలా అందరు ఒకేచోట కలిశారు అంతేకాదు వీరంతా కలిసి దిగిన పిక్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. 

టాలెంట్ ఉన్న దర్శకులంతా ఒకచోట చేరి టైం స్పెండ్ చేయడం మంచి విషయం. వీరు మాత్రమే కాదు మిగతా కొంతమంది దర్శకులకు వంశీ ఇన్విటేషన్ పంపగా వారు పనుల వల్ల రాలేకపోయారట. మొత్తానికి క్రేజీ డైరక్టర్స్ పిక్ అంటూ ఈ ఫోటో ప్రేక్షకులను అలరిస్తుంది. వంశీ ఇచ్చిన తేనేటి విందు ఆస్వాదించి ఆ తర్వాత ఇలా ఫోటోలకు స్టిల్ ఇచ్చారు దర్శకులు. వంశీ పైడిపల్లి మహేష్ 25వ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అశ్వనిదత్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది.