ఈసారైనా 'పంతం' నెగ్గించుకుంటాడా..!

మాన్లీ స్టార్ గా మాస్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న గోపిచంద్ సడెన్ గా కెరియర్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. మాస్ సినిమాలను వదిలి కామెడీ ఎంటర్టైనర్స్ మొదలు పెట్టిన గోపిచంద్ ఇప్పుడు తన రూట్ లోకి వచ్చినట్టు కనబడుతున్నాడు. చక్రవర్తి డైరక్షన్ లో వస్తున్న గోపిచంద్ లేటెస్ట్ మూవీ పంతం. ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. సినిమాలో గోపిచంద్ లుక్ ఫిట్ అండ్ పర్ఫెక్ట్ గా ఉంది.

పొలిటికల్ సెటైర్ తో పాటుగా కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా టీజర్ మాత్రం ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. హ్యాకింగ్, పొలిటికల్ సెటైర్ ఇలా కథ రొటీన్ గా అనిపించినా కథనం కొత్తగా ఉంటే ప్రేక్షకులు హిట్ చేస్తారు. టీజర్ కట్ చేసిన విధానం చూస్తుంటే ఈసారి గోపిచంద్ పంతం నెగ్గించుకునేలా ఉన్నాడని చెప్పొచ్చు. గోపిచంద్ సరసన మెహెరీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.