జక్కన్న ట్రైలర్ టాక్ : కామెడీనే నమ్ముకున్న సునీల్

కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్ సరైన హిట్స్ లేక సతమతమవుతున్నాడు. ఈ ఏడాదిలో సునీల్ నటించిన క‌ృష్ణాష్టమి సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర చతికలపడిపోయింది. దీంతో డీలా పడిన సునీల్ ఇక లాభం లేదని మళ్లీ తన పాత స్టైయిల్‌నే నమ్ముకొని,  జక్కన్న అనే టైటిల్‌తో ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అయ్యాడు. తాజాగా జరిగిన ఈ సినిమా ఆడియో వేడుకలో, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సినిమా ఆడియోతో పాటు ట్రైలర్ కూడా విడుదలైన విషయం తెలిసిందే.  

ఇక జక్కన్న ట్రైలర్‌ను చూస్తే.. ఈ సారి సునీల్ కొత్తగా ఏమీ ట్రై చేయకూడదని ఫిక్స్ అయినట్లు కనిపిస్తుంది. ట్రైలర్ మొత్తం కామెడీతో నవ్వులు పూయించారు సునీల్ అండ్ టీమ్. సునీల్ ఈ సారి కామెడీ డోస్ పెంచుతూ, కామెడి టైమింగ్‌తో పాటు పంచ్‌లు కూడా బాగానే పేలాయి. ఇక జక్కన్న ట్రైలర్ మొత్తానికి హైలైట్ థర్టీ ఇయర్స్ పృధ్వీ అనే చెప్పాలి. మనోడు ఈ సారి చెలరేగిపోయి చేసిన కామెడీ, ఆడియెన్స్‌ను బాగా నవ్విస్తుంది. పృధ్వీ చెప్పే ఒక్కో డైలాగ్‌ నవ్వుల బాంబులు పేల్చాయి. మొత్తానికి ఈ సారి తన ఒరిజినల్ నవ్వుల ట్రాక్‌ని నమ్ముకున్న సునీల్, జక్కన్న సినిమాతో హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు ఆకెళ్ల వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా సుదర్శన రెడ్డి నిర్మిస్తున్నారు. జూలై 25న జక్కన్న సనిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సిద్ధంగా ఉంది.