నాని బిగ్ బాస్.. వెనుక అల్లు అరవింద్..!

స్టార్ మాలో రాబోతున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈమధ్యనే ఈ రియాలిటీ షో ప్రోమోస్ టివిలో సందడి చేస్తున్నాయి. మొదటి సీజన్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయగా ఈ సీజన్ ను నానిని ఎంపిక చేశారు. అయితే నాని సెలఖన్స్ లో ప్రధాన కారకుడు అల్లు అరవింద్ అని తెలుస్తుంది. 

సడెన్ గా ఓ రోజు అల్లు అరవింద్ నానికి ఫోన్ చేశారట. ఈసారి బిగ్ బాస్ కు హోస్టువి నువ్వే అనేశారట. అరవింద్ గారు ఆ విషయాన్ని స్ట్రాంగ్ గా చెప్పారని.. ఆయన నా మీద పెట్టుకున్న విశ్వాసం చూసి తనకు అది చేయగలననే నమ్మకం వచ్చిందని అన్నారు.

ఇక మొదటి సీజన్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేసినా తాను ఆ షో చూడలేదని చెప్పిన నాని. తారక్ సలహాలు తీసుకున్నట్టు చెప్పాడు. ఎవరి మాట వినకుండా నీకు నచ్చింది చెయ్యి అని ఎన్.టి.ఆర్ సలహా ఇచ్చాడని నాని చెప్పాడు.