
సినిమా.. క్రికెట్ రెండు క్రేజీ ఫీల్డులే.. రెండిటిలో అవకాశం సంపాదించడం కష్టం. అయితే ఒక్కసారి అక్కడ సత్తా చాటితే ఆ లెక్క వేరేలా ఉంటుంది. అయితే ఈ సెలబ్రిటీస్ మీద ఆడియెన్స్ కన్ను ఉంటుంది. క్రికెటర్ ఏం చేస్తున్నాడు ఏ హీరోయిన్ తో క్లోజ్ గా ఉంటున్నాడు అన్నది అబ్సర్వ్ చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం ఓ యంగ్ క్రికెటర్ తో బాలీవుడ్ భామ కలిసి ఉండటం చూసి వారి మధ్య లవ్.. కాదల్.. ఇష్క్.. అంటూ వార్తలు రాసేస్తున్నారు.
ఇక ఈ వార్తలు తమ దాకా రావడంతో స్పందించారు సదరు సెలబ్రిటీస్. యువ క్రికెటర్ కే.ఎల్ రాహుల్, హీరోయిన్ నిధి అగర్వాల్ ఇద్దరు కలిసిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఇద్దరు స్పందించారు. ఇద్దరం బెంగళూరుకి చెందిన వాళ్లం కాబట్టే కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిశాం అంతేకాని తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని అన్నారు.
రాహుల్ అయితే తాను ఎవరితోనైనా లవ్ లో పడితే ఆ విషయాన్ని ముందే చెప్పేస్తానని అన్నాడు. ఇక తెలుగులో నాగ చైతన్య సరసన సవ్యసాచి సినిమాలో నటిస్తున్న నిధి అగర్వాల్ ఈమధ్య ఫోటో షూట్స్ తో తెగ హడావిడి చేస్తుంది.