శ్వేతా బసు పెళ్లికూతురవుతుంది..!

కొత్తబంగారు లోకం సినిమాతో యువత మనసులను దోచేసిన శ్వేతా బసు ప్రసాద్ మధ్యలో కొన్ని అభియోగాల వల్ల కెరియర్ లో వెనక్కి పడ్డది. బాలీవుడ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ కాలం వెళ్లదీస్తున్న శ్వేతా బసు పెళ్లికి సిద్ధమయ్యిందని తెలుస్తుంది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్ ని పెళ్లిచేసుకోబోతుంది శ్వేత బసు ప్రసాద్. 

నాలుగేళ్లుగా వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందట. శ్వేతా ఈ విషయాన్ని ఎప్పుడు లీక్ చేయలేదు. తెలుగులో కెరియర్ ముగించేసిన శ్వేతా రోహిత్ తో నిశ్చితార్ధం కూడా ఈమధ్యనే జరుపుకుందట. త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయని తెలుస్తుంది. వీరి పెళ్లికి అనురాగ్ కశ్యప్ ప్రధాన కారణమని అంటున్నారు. రెండు ఫ్యామిలీస్ తో మాట్లాడి మ్యారేజ్ జరిగేలా చూస్తున్నాడట అనురాగ్ కశ్యప్. అనురాగ్ కశ్యప్ ఫాన్టం ఫిలిమ్స్ కు స్క్రిప్ట్ కన్సల్ టెంట్ గా శ్వేత బసు ప్రసాద్ పనిచేస్తున్నారు.