సమ్మర్ కే 'సైరా' అంటున్నారు..!

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా చేస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా 40 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమా 150 కోట్ల భారీ బడ్జెట్ లో బాహుబలి రేంజ్ లో తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. 

ఇక ఈ సినిమాను 2019 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అసలైతే ముందు 2019 సంక్రాంతికి రిలీజ్ అనుకున్నా అప్పుడు కన్నా సమ్మర్ అయితే బెటర్ అని నిర్ణయించుకున్నారట. సమ్మర్ లో స్కూల్స్, కాలేజ్ అన్నిటికి హాలీడేస్ కాబట్టి కచ్చితంగా వసూళ్ల పరంగా కూడా రికార్డులు సృష్టించొచ్చని రిలీజ్ సమ్మర్ కు వాయిదా వేశారట. ఈ ఇయర్ సమ్మర్ లో రంగస్థలం రచ్చ తెలిసిందే. భరత్ అనే నేను కూడా బాక్సులు బద్ధలు కొట్టగా.. మహానటి కూడా సమ్మర్ సూపర్ హిట్ అయ్యింది.