
బిగ్ బాస్ కొత్త సీజన్ కు నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేస్తున్నాడని తెలిసిందే. మొన్నామధ్య చిన్న ప్రోమోతో సర్ ప్రైజ్ చేసిన నాని షో మొదలయ్యే డేట్ దగ్గరపడుతుండటంతో స్పీడ్ పెంచాడు. ఇక లేటెస్ట్ గా మరో కొత్త ప్రోమోతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాని. ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కోరకం అంటూ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమో చూస్తే రీసెంట్ గా తన నిర్మాణంలో వచ్చిన అ! సినిమా గుర్తుకొస్తుంది.
ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో వచ్చిన అ! సినిమాలో నాని చేపకు వాయిస్ ఓవర్ చెప్పాడు. అంతేకాదు ఆ సినిమా కాన్సెప్ట్ కు నాని చాలా కనెక్ట్ అయ్యాడు. అందుకే సినిమాను తను ప్రొడ్యూస్ చేశాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ కోసం కూడా అ! టైపులో ప్రోమోలు చేస్తున్నాడు. జూన్ 10న మొదలవనున్న బిగ్ బాస్ సీజన్ 2లో స్టార్ సెలబ్రిటీస్ కంటెస్టంట్స్ గా హౌజ్ లో ఉండనున్నారట.