
పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనకు మెగా సపోర్ట్ ఉందా లేదా అన్నది ఒకప్పటి ప్రశ్న. ఈమధ్య మెగా కాంపౌండ్ అంతా పవన్ కు సపోర్ట్ గా నిలిచింది. పవన్ ఒక్కడే కాదు ఆయన వెనుక మేమంతా ఉన్నాం అంటూ సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉన్నారు. ప్రస్తుతం పోరాట యాత్ర పేరుతో ప్రజల్లోనే గడుపుతున్న పవన్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు ప్రచారానికి తాము సిద్ధం అంటున్నారు మెగా హీరోలు.
రీసెంట్ గా రాం చరణ్ కూడా బాబాయ్ పిలిస్తే తాను కూడా జనసేన కోసం ప్రచారానికి సిద్ధమే అన్నాడు. దానికి పవన్ కూడా ఓకే అన్నాడు. కాని దిగేప్పుడు ఆలోచించుకుని దిగాలని సలహా ఇచ్చాడు. ఇక లేటెస్ట్ గా మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ కూడా మామయ్య వెంటే తాను అంటున్నాడు. ఆయన ఒక్కమాట చెప్పాలే కాని జనసేన వెంట నడిచేందుకు తాను సిద్ధమే అంటున్నాడు సాయి ధరం తేజ్.
ప్రస్తుతం తను చేస్తున్న తేజ్ ఐలవ్యూ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమహేంద్ర వరం లో తేజూ ఈ విషయాలను ప్రస్థావించాడు. కరుణాకరణ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కెస్. ఎస్ రామారావు నిర్మిస్తున్నారు.