300 కోట్లతో రాజమౌళి ట్రిపుల్ ఆర్..!

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమాపై ఎలాంటి న్యూస్ బయటకు వచ్చినా అది ట్రెండింగ్ అవుతుంది. రాం చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి చేస్తున్న ఈ సినిమా రికార్డులు సృష్టించడం గ్యారెంటీ. ఈ సినిమా కథ ఇదే అంటూ వారానికొకటి బయటకు వస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమాకు బడ్జెట్ తో పాటుగా సినిమాలో చరణ్, ఎన్.టి.ఆర్ బ్రదర్స్ గా నటిస్తున్నారనే వార్త లీక్ అయ్యింది.

సినిమాలో చరణ్ పోలీస్ గా కనిపిస్తాడని తెలుస్తుండగా.. ఎన్.టి.ఆర్ మాత్రం గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడట. అయితే ఇద్దరు కలిసి చేసే సీన్స్ చాలా తక్కువ ఉంటాయట. క్లైమాక్స్ కు దగ్గరలో ఇద్దరు కలుస్తారని అంటున్నరు. అంతేకాదు ఈ సినిమాకు 300 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు బాహుబలి రేంజ్ బడ్జెట్ తో ఈ సినిమా తీస్తున్నారు. తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేసేలా జక్కన్న ఈ మూవీని గ్రాండియర్ గా తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యాడు.