టాటూ వెనుక ఇంత కథ ఉందా..!

అక్కినేని యువ హీరో నాగ చైతన్య, సమంతల లవ్ మ్యారేజ్ అందరికి తెలిసిందే. ఏమాయ చేసావే నుండి ఇద్దరి లవ్ ట్రాక్ నడిపిస్తూ ఫైనల్ గా ఇంట్లో వాళ్లను మెప్పించి ఒప్పించి పెళ్లిచేసుకున్నారు. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 6న చైతు, సమంత ఒకటయ్యారు. ఛాన్స్ దొరికితే చైతు మీద సమంత, సమంత మీద చైతు ప్రేమ చూపించడం ఈమధ్య చూస్తూనే ఉన్నాం. భార్య భర్తలు కాబట్టి ఆమాత్రం ఉండటం కామన్.

ఇక ఈమధ్య చైతు చేతికి ఉన్న టాటూ కూడా సమంత మీద ప్రేమతో వేయించుకున్నదే అని తెలుస్తుంది. సమంత చేతి మీద కూడా ఇలాంటి టాటూ ఒకటి ఉంటుంది. ఇంతకీ ఈ ట్యాటూ అర్ధం ఏంటంటే 6-10-17 అని అంటున్నారు. ఇవేంటి అంకెలని ఎందుకు టాటూలుగా వేసుకున్నారు అంటే చైతు, సమంత పెళ్లి జరిగిన అక్టోబర్ 6, 2017ని చేతి మీద గుర్తుగా వేసుకున్నారు ఈ ఇద్దరు. మరి ఈ ఇద్దరి ప్రేమ చూసి మిగతా వారు కుళ్లికోవడం ఖాయమని చెప్పొచ్చు.