వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో మెగా హీరో?

టాప్ డైరెక్టర్స్ జాబితాలో చేరాలంటే చాలా హిట్ సినిమాలు చేసి ఉండాల్సి వచ్చేది ఒకప్పుడు. కానీ ప్రస్తుతం ఒక మంచి సినిమా హిట్ అయ్యిందంటే చాలు, ఆ డైరెక్టర్ టాప్ లిస్ట్‌లో చేరిపోతున్నాడు. ఇటీవల కాలంలో టాలీవుడ్‌ టాప్ డైరెక్టర్స్ లిస్ట్‌లో వంశీ పైడిపల్లి పేరు బాగానే మారుమోగిందనే చెప్పాలి. అందుకు కారణం ఆయన తీసిన ఊపిరి సినిమా. 'ది ఇన్‌టచబుల్స్' అనే ఫ్రెంచ్ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఊపిరి, తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున, తమిళ స్టార్ కార్తీ హీరోలుగా నటించి ఆడియెన్స్ చేత చప్పట్లు కొట్టించడంలో సక్సెస్ అయ్యారు. ఇక ఈ సినిమా తరువాత వంశీ పైడిపల్లి తరువాత సినిమా ఎవరితో తీస్తాడనే టాక్ గత కొంత కాలంగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది.  

ఊపిరి సినిమా తరువాత అక్కినేని వారసుడు అక్కినేని అఖిల్‌తో సినిమా ఉండబోతోందంటూ గతంలో వంశీ పైడిపల్లి స్వయంగా చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఇక ఆ తరువాత టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబుకు ఓ కధ వినిపించాడు ఈ డైరెక్టర్. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. అయితే చివరకు వంశీ పైడిపల్లి తన తరువాత సినిమాను మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ తో తీయనున్నాడా, అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న సాయి ధరమ్ తేజ్ కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేశాడట వంశీ. కధ నచ్చడంతో తేజ్ కూడా వంశీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.  అయితే సాయి ధరమ్ తేజ్ తిక్క తరువాత గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో ఓ సినిమా కమిట్ అయ్యాడు. సో.. వంశీ పైడిపల్లి సినిమా రావడానికి ఇంకా లేట్ అవుతుందనే చెప్పాలి.