
రీసెంట్ గా వచ్చిన సావిత్రి బయోపిక్ మహానటి సినిమా సూపర్ సక్సెస్ అవడంతో ఇప్పుడు అందరి దృష్టి బయోపిక్ సినిమాల మీద పడ్డది. ఇక ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఎన్.టి.ఆర్, యాత్ర బయోపిక్ లు కూడా మహానటి స్థాయి విజయాన్ని అందుకోవాలని ఉత్సాహపడుతున్నాయి. ఇక ఆ క్రమంలోనే ఏయన్నార్ బయోపిక్ కూడా ప్రస్థావనలోకి వచ్చింది.
దీనిపై కింగ్ నాగార్జున మాట్లాడటం జరిగింది. తన తండ్రి బయోపిక్ సినిమా మెటీరియల్ కాదని ఆయన నటుడిగా ఎదిగిన నాటి నుండి చనిపోయేంతవరకు జీవితమంతా ఫ్లాట్ గా సాగుతుందని అందుకే ఏయన్నార్ బయోపిక్ తీసే ఆలోచన లేదని అన్నారు నాగార్జున. తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్.టి.ఆర్ తర్వాత అంతటి మహానటుడు ఏయన్నారే.. తెలుగు పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ తరలి రావడానికి ఏయన్నార్ కృషి తెలిసిందే. మరి అలాంటి ఏయన్నార్ జీవితం సినిమాగా తీయడం కుదరదని నాగ్ చెప్పడం కాస్త షాకింగ్ గానే ఉంది.