డోస్ పెంచేసిన తెలుగమ్మాయి..!

టాలీవుడ్ లో తెలుగమ్మాయిలకు తగినన్ని అవకాశాలు రావు అన్నది కొందరు వాదన. అయితే ముంబై హీరోయిన్స్ లా మనవాళ్లు ఎక్స్ పోజింగ్ గట్రా చేయడం కుదరదని వారిని అందుకే దర్శక నిర్మాతలు పెట్టుకోరని టాక్. ఇక తమ టాలెంట్ తో ఒకరిద్దరు తెలుగమ్మాయిలు సినిమాల్లో కనిపించినా వారికి అంత క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉండదని అంటుంటారు. కాని ఆ వార్తలను బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తుంది ఈషా రెబ్బ.

అంతకుముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈషా రెబ్బ ఇప్పుడున్న మలయాళ, ముంబై హీరోయిన్స్ తో పాటుగా క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఆ క్రేజ్ మరింత పెంచుకునే క్రమంలో తన లోని హాట్ నెస్ కూడా చూపించేస్తుంది. ఇటీవల అమ్మడు ట్విట్టర్ లో స్విమ్ సూట్ లో పెట్టిన పిక్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. అవకాశం వస్తే తాము కూడా ఎలాంటి పాత్రలకైనా సిద్ధమే అన్నట్టు ఈషా హింట్ ఇచ్చేస్తుంది.  

ప్రస్తుతం అమ్మడు త్రివిక్రం డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ హీరోగా వస్తున్న అరవింద సమేత సినిమాలో ఛాన్స్ పట్టేసిందని తెలుస్తుంది. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈషా రెబ్బ కూడా సెకండ్ ఫీమేల్ లీడ్ గా నటిస్తుందట.