
కోలీవుడ్ స్టార్ డైరక్టర్ శంకర్ తాను ఏ సినిమా తీసినా సరే ఆ సినిమా మ్యూజిక్ డైరక్టర్ గా ఏ.ఆర్.రెహమాన్ నే పెట్టుకుంటాడు. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్ని సూపర్ హిట్లే. మనదగ్గర రాజమౌళి కేవలం కీరవాణితో చేస్తున్నట్టుగా శంకర్ రెహమాన్ తో చేస్తూ వచ్చాడు. ప్రస్తుతం రోబో సీక్వల్ గా వస్తున్న 2.ఓ తర్వాత శంకర్ కమల్ హాసన్ తో ఇండియన్-2 సినిమా చేయనున్నాడు.
ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా అనిరుద్ రవిచంద్రన్ ను సెలెక్ట్ చేశారట. యువ సంగీత దర్శకుడిగా తమిళ సంగీత ప్రియులను అలరిస్తున్న అనిరుద్ రెహమాన్ ప్లేస్ కొట్టేశాడు అంటే మాములు విషయం కాదు. కొలవెరి డీ అంటూ ప్రపంచాన్ని తన సంగీతంతో ఊర్రూతలూగించిన అనిరుద్ ప్రెస్టిజియస్ ప్రాజెక్టులో భాగం కావడం విశేషం. రెహమాన్ తర్వాత అంతటి మ్యూజిక్ క్వాలిటీ ఇవ్వగలడనే నమ్మకంతోనే శంకర్ ఈ సాహసం చేసి ఉండొచ్చని అంటున్నారు. మరి శంకర్ పెట్టుకున్న ఈ నమ్మకాన్ని అనిరుద్ ఎలా నిలబెట్టుకుంటాడో చూడాలి.
తెలుగులో అయితే అనిరుధ్ కు మొదటి సినిమానే చేదు అనుభవాన్ని మిగిల్చింది. త్రివిక్రం, పవన్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించగా ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.