
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్‌లో కాజల్ అగర్వాల్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తెలుగు హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. తన నటనతో పాటు అందాల ఆరబోత తోనూ అతి తక్కవ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది ఈ బ్యూటీ. టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు, బాలీవుడ్ లో కూడా నటించిన కాజల్, గత కొంత కాలంగా సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, దో లఫ్జోంకీ కహానీ లాంటి వరస ఫ్లాపులతో, ఐరన్ లెగ్ అని పేరు తెచ్చుకున్న ఈ గుమ్మకి, ప్రస్తుతం ఆఫర్లు కరువయ్యాయని, అందుకని పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంపై కాజల్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ, తనకు సినిమా ఆఫర్స్ ఏమాత్రం తగ్గలేదని.. సినిమాలను ఆపే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పింది కాజల్. ఇక తన పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ కూడా కేవలం రూమర్స్ అంటూ కొట్టిపడేసింది. తెలుగులో డైరెక్టర్ తేజ దర్శకత్వంలో రానా హీరోగా ఓ సినిమా చేయనున్నట్లు కాజల్ ఈ సందర్భంగా తెలిపింది.