
తెలుగులో రియాలిటీ షోలో కొత్త అనుభూతి కలిగిన బిగ్ బాస్ ఇప్పుడు సెకండ్ సీజన్ కు రెడీ అవుతుంది. మొదటి సీజన్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేయగా సెకండ్ సీజన్ లో ఆ ఛాన్స్ నాచురల్ స్టార్ నాని అందుకున్నాడు. జూన్ 10 నుండి మొదలవనున్న ఈ సినిమాలో 16 మంది కంటెస్టంట్స్ పాల్గొంటున్నారు. అయితే ఈ 16 మంది సెలబ్రిటీస్ వీరే అంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ చెక్కర్లు కొడుతుంది.
ఇంతకీ ఈసారి కంటెస్టంట్స్ గా ఎవరెవరు ఉన్నారంటే.. హీరో తరుణ్, ఆర్యన్ రాజేష్, వరుణ్ సందేశ్, ఒకప్పటి హీరోయిన్ రాశి, గజాల, ఛార్మి, సింగర్ గీతా మాధురి, యాంకర్ శ్యామలా, లాస్య, హీరోయిన్ చాందిని చౌదరి, వీరితో పాటుగా హీరోయిన్ శ్రీదేవి, ధన్య బాలకృష్ణలు ఈసారి బిగ్ బాస్ హౌజ్ కు వస్తున్నారట. ఇక వీరితో పాటుగా కొన్నాళ్లుగా వార్తల్లో ఉంటున్న శ్రీ రెడ్డి కూడా బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో కంటెస్టంట్ గా ఉంటుందట.
మొత్తానికి లిస్ట్ బయటకు వచ్చినా వీరిలో ఎవరు ఫైనల్ గా ఉంటారు అన్నది ఆరోజు మాత్రమే తెలుస్తుంది. మొదటి సీజన్ తారక్ తన హోస్టింగ్ టాలెంట్ తో షో సక్సెస్ చేయగా ఇప్పుడు ఆ బాధ్యత నాని తీసుకున్నాడు మరి ఏం చేస్తాడో చూడాలి.