
స్టార్ హీరోయిన్ గా అనతికాలంలోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం కెరియర్ కాస్త సందిగ్ధంలో పడటంతో అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. ఇక రీసెంట్ గా మహానటి సినిమా అద్భుత విజయం అందుకోవడంతో అలాంటి బయోపిక్ లో చిన్న పాత్ర చేసినా చాలు అనే భావన కలిగిందట. అందుకే ప్రస్తుతం సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ పై కన్నేసింది రకుల్.
నందమూరి బాలకృష్ణ నిర్మాతగా అన్ని తానై తెరకెక్కిస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ మూవీ ఎన్.టి.ఆర్ లో ఎలాంటి చిన్న పాత్ర అయినా సరే తాను చేసేందుకు సిద్ధమే అంటూ చెప్పిందట రకుల్ ప్రీత్ సింగ్. బాలయ్య కూడా అందుకు సరే అన్నట్టు తెలుస్తుంది. క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కబోయే ఈ బయోపిక్ లో రకుల్ కూడా నటిస్తుందన్నమాట. ఇప్పటికే బసవతారక పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్ ఓకే చెప్పింది. మరి రకుల్ ఏ పాత్రలో నటిస్తుందో చూడాలి.