ఆశలన్నీ మహేష్ సినిమాపైనే..!

భరత్ అనే నేను సినిమాతో బాక్సులు బద్ధలయ్యేలా తన సత్తా ఏంటో చూపించిన సూపర్ స్టార్ మహేష్ తన 25వ సినిమాగా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు, అశ్వనిదత్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడట. సినిమాలో మహేష్, నరేష్ లు స్నేహితులుగా నటిస్తున్నారని తెలుస్తుంది.

మహేష్ ధనికుడిగా.. అల్లరి నరేష్ పేదవాడిగా కనిపిస్తారట. కష్టం వచ్చిన స్నేహితుడిని కాపాడాలనే ఉద్దేశంతో హీరో ఏం చేశాడు అన్నదే ఈ సినిమా కథ అని తెలుస్తుంది. కొన్నాళ్లుగా కెరియర్ లో వెనుకపడి ఉన్న నరేష్ ఈ సినిమాతో మళ్లీ నిలబడాలని ప్రయత్నిస్తున్నాడు. వంశీ పైడిపల్లి ఈ సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడట. మరి నరేష్ నిలబడేలా ఈ సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి.