
కావేరి జలాల విషయంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య గొడవ కొనసాగుతూనే ఉంది. అయితే స్టార్ సినిమాల రిలీజ్ విషయానికొచ్చే సరికి ఈ వ్యవహారం గుర్తుచేస్తూ కర్ణాటకలో తమిళ హీరోల సినిమాలను రిలీజ్ చేయకుండా చూస్తున్నారు. ఇక రాబోతున్న రజినికాంత్ కాలా సినిమాకు ఈ కష్టాలు తప్పేలా లేవు. సుప్రీం తీర్పుని తప్పుపడుతూ కావేరి జలాల విషయంలో రజిని తమిళనాడుకి సపోర్ట్ గా మాట్లాడాడు.
దాన్ని పట్టుకుని కర్ణాటక ప్రేక్షకులు కాలా సినిమా ఇక్కడ రిలీజ్ కానివ్వబోమని చెబుతున్నారు. దీనిపై ఆల్రెడీ కర్ణాటక నిర్మాతల మండలితో చర్చలు కూడా జరిపారట. అయితే ఈ విషయంపై స్పందించిన రజినికాంత్ తన సినిమా కర్ణాటకలో ఎందుకు రిలీజ్ చేయనివ్వమంటున్నారో అర్ధం కావడం లేదని అంటున్నారు. ఈ విషయంపై సౌత్ ఇండియా ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ జోక్యం చేసుకోవాల్సిందిగా కోరారు.