
సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన రంగస్థలం సినిమా అంచనాలను మించి వసూళ్లను రాబట్టింది. చరణ్ చిట్టిబాబుగా కొత్త ఉత్సాహంతో కనిపించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా 125 కోట్ల షేర్ కలెక్ట్ చేసి నాన్ బాహుబలి రికార్డులన్నిటిని పక్కన పెట్టేసింది. ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా అదనపు ఆకర్షణ అయ్యిందని చెప్పొచ్చు.
సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్ కాగా సమంత సోలో సాంగ్ రంగమ్మా, మంగమ్మా మాత్రం ఇంకా యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. సినిమా వీడియో సాంగ్స్ రిలీజ్ చేయగా రంగమ్మా.. మంగమ్మా సాంగ్ నెల రోజుల్లో 42 లక్షల వ్యూస్ తో సంచలనం సృష్టించింది. దేవి కంపోజింగ్ సమంత, చరణ్ ల క్యూట్ ఫైటింగ్ సినిమాలోని ఈ పాటకు మరింత కలరింగ్ తెచ్చింది. బాహుబలి-2 సాంగ్స్, ఫిదా వచ్చిందే సాంగ్ తర్వాత యూట్యూబ్ లో రంగమ్మా.. మంగమ్మా సాంగ్ సరికొత్త సంచలనంగా మారింది.