విలన్ వేషాలకు సై అంటున్న మంచు హీరో

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు, యంగ్ హీరో మంచు విష్ణు ఇటీవల ‘ఈడోరకం ఆడోరకం’ సినిమాతో సక్సెస్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ హాలిడే ట్రిప్ అంటూ ఇటీవల లండన్ వెళ్లిన విష్ణు తాజాగా తిరిగి ఇండియాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టుపై ఇంకా పూర్తి క్లారిటీ ఇవ్వని విష్ణు తాజాగా తన మనసులో ఉన్న ఓ ఆసక్తికర విషయాన్ని ఓ అభిమానికి చెప్పాడట. 

మంచు విష్ణుకు తమిళనాట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా కోలీవుడ్ నుంచి వచ్చిన ఓ అభిమాని మంచు విష్ణుని ‘‘మీకు తమిళంలో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా? స్టార్ హీరోల సినిమాల్లో విలన్‌గా ఛాన్స్ వస్తే చేస్తారా?’’ అని అడిగాడట. దానికి పాజిటివ్‌గా స్పందిస్తూ, మంచి కథతో మూవీ మేకర్స్ తన దగ్గరకు వస్తే, తప్పకుండా చేస్తానని, అది విలన్ పాత్ర అయినా చేయడానికి తాను సిద్ధమని, విష్ణు తెలిపారు. దీంతో ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో విష్ణుపై ఇంట్రెస్ట్ పెరిగిందని సమాచారం. మరి చూడాలి తన తండ్రిలా విష్ణు కూడా విలన్ రోల్స్‌లో ఇరగదీస్తాడో లేదో.