కాలా ట్రైలర్.. ఓ లుక్కేయండి..!

కబాలి తర్వాత మరోసారి పా.రంజిత్ తో సూపర్ స్టార్ రజినికాంత్ చేస్తున్న సినిమా కాలా. తెలుగు, తమిళ భాషల్లో జూన్ 7న రిలీజ్ అవుతున్న ఈ సినిమా నుండి రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అంచనాలకు తగినట్టుగానే మాస్ లీడర్ గా రజిని కనిపించాడు. ఇక విలన్ గా నానా పటేకర్ నటించడం విశేషం. కబాలి టీజర్ తో సంచలనం సృష్టించిన పా. రంజిత్ అదేవిధంగా కాలా టీజర్, ట్రైలర్ లను కట్ చేశారు.

నేల నీకు అధికారం.. నేల మాకు జీవితం.. ఈ తనువే మనకున్న ఏకైక ఆయుధం.. ఇది ఈ లోకానికి చాటుదాం.. పదండి ఉద్యమిద్దాం.. అంటూ రజిని చెప్పే డైలాగ్ అదిరిపోయాయని చెప్పొచ్చు. రజిని పొలిటికల్ కెరియర్ కు కూడా ఈ కాలా సపోర్ట్ చేస్తుందని అంటున్నారు. వండర్ బార్ ఫిలింస్ లో ధనుష్ నిర్మించిన ఈ సినిమాతో రజిని తన ఫ్యాన్స్ ను అలరిస్తాడని అందరు ఆశిస్తున్నారు.