రెమ్యునరేషన్ కోసమే నేల టిక్కెట్టు..!

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా నేల టిక్కెట్టు. అంచనాలను అందుకోవడంలో విఫలమైన ఈ సినిమా రవితేజ ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురి చేసింది. అసలు రవితేజ ఈ సినిమా ఎలా చేశాడు ఎందుకు చేశాడంటూ కామెంట్లు చేశారు. ఈ సినిమా కోసం రవితేజ రెమ్యునరేషన్ గా 11 కోట్లు అందుకున్నాడట. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ వచ్చేసరికి కాదనలేకపోయాడు.

ఎలాగు సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం ఇలా రెండు హిట్లు కొట్టిన దర్శకుడు కాబట్టి కచ్చితంగా సినిమా కూడా హిట్ అవుతుందన్న ఉద్దేశంతో కళ్యాణ్ కృష్ణ తో జత కట్టాడు. కాని సినిమాను ఆడియెన్స్ ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేదు. బెంగాల్ టైగర్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని రాజా ది గ్రేట్ తో హిట్ కొట్టిన రవితేజ టచ్ చేసి చూడుతో పాటుగా నేల టిక్కెట్టుని తన ఫెయిల్యూర్స్ ఖాతాలో వేసుకున్నాడు. మరి ఇంక నుండైనా కథల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.