ఓవర్సీస్ లో టాప్ లేపిన మహానటి..!

సావిత్రమ్మ జీవిత కథగా వచ్చిన మహానటి సినిమా అంచనాలను మించి వసూళ్లను రాబట్టింది. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఓవర్సీస్ లో 2.5 మిలియన్ డాలర్స్ వసూళ్లను సాధించింది. ప్రీమియర్స్ మొదటి రోజు కలక్షన్స్ తోనే 1.5 మిలియన్ క్రాస్ చేయగా రెండో వారం కాస్త నెమ్మది కాదా మూడవ వారంలో మళ్లీ కలక్షన్స్ ఊపందుకున్నాయి. పొటీగా మరే సినిమా నిలబడకపోవడం కలిసి వచ్చిన అంశం.

ప్రస్తుతం 2.5 మిలియన్స్ క్రాస్ చేసిన మహానటి సినిమా ఓవర్సీస్ టాలీవుడ్ సినిమాల హయ్యెస్ట్ కలక్షన్స్ లో 6వ స్థానంలో ఉంది. శీమంతుడు 2.87 మిలియన్స్ లో 5వ స్థానంలో ఉంది. మరి శ్రీమంతుడుని మహానటి క్రాస్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. బాహుబలి-2, బాహుబలి-1, రంగస్థలం, భరత్ అనే నేను, శ్రీమంతుడు ఇలా ఐదు సినిమాలు ఓవర్సీస్ లో టాప్ కలక్షన్స్ సాధించాయి.