
కింగ్ నాగార్జున, ఆర్జివి కాంబినేషన్ అంటే శివ గుర్తుకు రావడం సహజం. శివ లాంటి ట్రెండ్ సెట్టర్ సినిమా తీసిన వర్మ ఆ తర్వాత ఆయన కెరియర్ లో ఎన్నో గొప్ప సినిమాలు చేశాడు. ఇక పాతికేళ్ల తర్వాత మళ్లీ శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆఫీసర్. రాం గోపాల్ వర్మ దర్శక నిర్మాతగా వస్తున్న ఈ ఆఫీసర్ సినిమా జూన్ 1న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా నిన్న సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు.
ఆఫీసర్ కథ చెప్పగానే చాలా నచ్చిందని.. తాను నమ్మే నిజం కోసం పోరాడే ఓ పోలీస్ ఆఫీసర్ కథే ఈ సినిమా. వర్మకు ఈ సినిమా ఓకే చెప్పడానికి ముందు తనకు ఓ పెద్ద లెటర్ రాశాడని అందులో బూతులు కూడా ఉన్నాయని. ఈ సినిమా ఆడకపోతే తనని ఎక్కడో తన్నమని చెప్పాడట. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ ప్రస్థావన తెస్తూ వర్మని తన్నాల్సిన అవసరం లేదని అన్నారు నాగార్జున.
ఇక శివ టైం నుండి సౌండ్ ఎఫెక్ట్స్ లో ఆ రేంజ్ సినిమా రాలేదని అనిపిస్తుంది. మళ్లీ తప్పకుండా ఆఫీసర్ సినిమా గొప్ప సౌండ్ ఎఫెక్ట్స్ తో రాబోతుందని అన్నారు. చాలా రోజుల తర్వాత రియల్ ఇంటెన్స్ యాక్షన్ మూవీ చేశానని.. చివరి 20 నిమిషాలు సినిమా అదిరిపోతుందని అన్నారు నాగార్జున. తెలుగు పరిశ్రమ శివకు ముందు శివకు తర్వాత అంటూ చెబుతారు శివ సినిమా వర్మకు బ్రేక్ ఇచ్చింది కాని తనకు మాత్రం అమలని ఇచ్చిందని అమల మీద తన ప్రేమని వ్యక్త పరచారు నాగార్జున.