
ఐపిఎల్ సీజన్ అంటే క్రీడాకారులను ఎంత మంచి ఎంటర్టైన్మెంట్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీజన్ సీజన్ కు ఐపిఎల్ హంగామా డబుల్ ట్రిపుల్ అవుతుండటం విశేషం. ఇక ఓ పక్క ఆన్ లైన్ బెట్టింగ్ మాత్రమే కాదు ఐపిఎల్ సీజన్ లో అసలు టోర్నీ అమౌంట్ కన్నా బయట జరిగే కోట్ల బిజినెస్ గురించి తెలిసి షాక్ అవుతారు. ఇక ఇదిలా ఉంటే ఈ ఐపిఎల్ సీజన్ లో టాలీవుడ్ యువ హీరో భారీగా లాస్ అయ్యాడని ఫిల్మ్ నగర్ టాక్.
సినిమాకు 3-4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే ఓ యువ హీరో ఈ ఐపిఎల్ సీజన్ లో హైదరాబాద్ మీద బెట్ కట్టాడట. హైదరాబాద్ దూకుడుతనం చూసి ఫైనల్ లో హైదరాబాద్ మీద లక్షల రూపాయలు బెట్ కట్టాడట. తీరా చూస్తే చెన్నై చేతిలో హైదరాబాద్ ఓడిపోయింది. మనోడికి లక్షల బొక్క పడిందట. ఈ ఫ్రస్ట్రేషన్ తన అసిస్టెంట్ మీద చూపించేసరికి ఆయన వచ్చి బయటకు చెప్పడం అది కాస్త మీడియాకు చేరడం జరిగింది. అయితే ఆ యువ హీరో ఎవరు అన్నది మాత్రం తెలియనివ్వట్లేదు.