మహేష్ సుకుమార్ కథ అదే..!

భరత్ అనే నేను సినిమాతో మహేష్, రంగస్థలం సినిమాతో సుకుమార్ ఇద్దరు సూపర్ హిట్ జోష్ లో ఉన్నారు. ఇక ఈ కాంబినేషన్ లో సినిమా షురూ చేశారు మైత్రి మూవీ మేకర్స్. ఆల్రెడీ సుకుమార్ డైరక్షన్ లో మహేష్ నటించిన 1 నేనొక్కడినే నిరాశపరచింది. భారీ అంచనాలతో వచ్చిన ఆ సినిమా మహేష్ నటన పరంగా మెప్పించినా కమర్షియల్ గా మాత్రం డిజాస్టర్ అయ్యింది.

ఇక ఆ సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు సుకుమార్ మహేష్ కలిసి చేయబోతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా ఓ క్రైం థ్రిల్లర్ అని తెలుస్తుంది. సినిమాలో మహేష్ సిఐడిగా కనిపిస్తారని అంటున్నారు. ఓ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారట. ప్రస్తుతం మహేష్ తన 25వ సినిమా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో చేయాల్సి ఉంది. అది పూర్తయ్యాక ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.