
త్రివిక్రం ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాబోతున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా ఓ పక్క శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ రాగా ఈ సినిమా కథ గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రం ప్రస్థావించడం జరిగింది. పవన్ కళ్యాణ్ తో 2014 ఆ టైంలో త్రివిక్రం తీయాలనుకున్న కొబలి సినిమా కథతో ఈ వీర రాఘవ కథ సిద్ధం చేసుకున్నాడట త్రివిక్రం.
పవన్ తో కొబలి అంతా రెడీ అనుకుని సెట్స్ మీదకు వెళ్లే టైంలో అటకెక్కింది. రాయలసీమ ఫ్యాక్షన్ కథల అసలు కథను తెలిపేలా ఆ కథను సిద్ధం చేశాడట త్రివిక్రం. అంతేకాదు టైటిల్ గా కొబలి ఎందుకున్ అంటే.. అక్కడ శత్రువులను చంపేటప్పుడు కసితో కోర బలి, నరుకు బలి అంటారట ఆ మాటల్లోంచి కొబలి వచ్చిది. అయితే అప్పట్లో ఆ సినిమా కోసం త్రివిక్రం చాలా రీసర్చ్ చేశాడట. ఆ కథలోని కొన్ని అంశాలతో ఈ అరవింద సమేత వీర రాఘవ వస్తున్నాడట. మరి కొబలి నుండి పుట్టిన ఈ వీర రాఘవ రికార్డుల పని పడతాడో లేదో చూడాలి.