అఫిషియల్.. ఎన్టీఆర్ కోసం క్రిష్..!

నందమూరి బాలకృష్ణ మొదలుపెట్టిన ఎన్.టి.ఆర్ బయోపిక్ తేజ డైరక్షన్ లో రావాల్సి ఉండగా అది కాస్త తాను చేయలేనని చెతులెత్తేశాడు. కొన్నాళ్లు డైరక్టర్ ఎవరన్న ప్రశ్నకు సమాధానం దొరకలేదు ఫైనల్ గా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో బాలయ్య 100వ సినిమాకు గొప్ప అనుభూతి ఇచ్చిన రాధాకృష్ణ జాగర్లమూడి అలియాస్ క్రిష్ మరళ ప్రతిష్టాత్మక ఎన్.టి.ఆర్ బయోపిక్ కు దర్శకుడిగా కన్ ఫాం అయ్యాడు. 

ఈరోజు ఎన్.టి.ఆర్ 95వ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని ఎనౌన్స్ చేశారు. ఇక తన మీద పెట్టిన ఈ బాధ్యతను తప్పకుండా జాతి గర్వించేలా సినిమా తీస్తానని అన్నారు క్రిష్. ఈమధ్యనే మహానటి సినిమాతో బయోపిక్ లకు ఓ స్పెషల్ క్రేజ్ రాగా.. క్రిష్ తీయబోయే ఎన్.టి.ఆర్ బయోపిక్ ఎలా ఉండబోతుందో అని ఇప్పటినుండే నందమూరి ఫ్యాన్స్ లో అంచనాలు మొదలయ్యాయి.