అఖిల్ కోసం క్రేజీ టైటిల్..!

అక్కినేని అఖిల్ హీరోగా చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలను రాబట్టలేదు. ఇక 3వ సినిమాగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో సినిమా మొదలుపెట్టాడు అఖిల్. తొలిప్రేమ సినిమాతో దర్శకుడిగా తొలి సినిమానే విజయాన్ని అందుకున్న వెంకీ తన సెకండ్ మూవీనే అఖిల్ ను డైరెక్ట్ చేయడం విశేషం. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ గా మిస్టర్ మజ్ను అని పెట్టే ఆలోచనలో ఉన్నారట.

నాగార్జున మజ్ను తర్వాత రీసెంట్ గా నాచురల్ స్టార్ నాని కూడా ఓ మజ్నుగా వచ్చి హిట్ అందుకున్నాడు. అయితే ఇప్పుడు అఖిల్ మరోసారి మజ్నుగా మారేందుకు సిద్ధమయ్యాడట. తొలిప్రేమలానే మంచి లవ్ స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట వెంకీ అట్లూరి. ఈ సినిమాకు టైటిల్ గా మిస్టర్ మజ్ను పెట్టబోతున్నారట. మిస్టర్ అనగానే వరుణ్ తేజ్.. మజ్ను అనగానే నాని సినిమా ఇలా ఈ రెండు సినిమాల టైటిల్స్ అఖిల్ కోసం వాడేస్తున్నారు.